Saturday, July 27, 2024

తుఫాను ప్రభావంతో పడిపోయిన ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -

సాధారణం కన్నా తక్కువ స్థాయికి..

మనతెలంగాణ/హైదరాబాద్:  మిగ్ జాం తుఫాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. తెలంగాణలో మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు చలికి వణుకుతున్నారు. తుఫాను ప్రభావంతో తెలంగాణలో మధ్యాహ్న సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాధారణం కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే సాధారణం కన్నా రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌లో డిసెంబర్ మొదటి వారంలో దాదాపు 12.1 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వాల్సి ఉండగా, గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పటాన్‌చెరులో 12.3 డిగ్రీలు, హైదరాబాద్, దుండిగల్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, రామగుండం, భద్రాచలంలో 5.9 నుంచి 4.8 డిగ్రీల మధ్య అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News