Saturday, July 27, 2024

రైతు భరోసా, రుణమాఫీపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది.పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంతోపాటుగా పంటల బీమా, రుణమాఫీపై విధివిధానాలు త్వరలో ఖరారు చేయనున్నట్టు తెలిపింది. సోమవారం నాడు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

త్వరలో ఖరీఫ్ పంటల సాగు సీజన్ ప్రారంభం కానుండటంతో రైతుభరోసా పథకం మార్గదర్శకాలు ఖరారు చేసేందుకు అవసరమై విధివిధానాలు సిద్ధ్దం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అదే విధంగా పంటల బీమా పథకానికి కూడా ఖరీఫ్ నుంచే అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి సంబంధించి కూడా ఏ ఏ రకమైన పంటలను బీమా పరిధిలోకి చేర్చాలి, ప్రీమియం ఎంత నిర్ణయించాలి, ఎటువంటి విపత్తులను బీమా పరిధీలో చేర్చాలి, రైతులు అకాల వర్షాలు వడగండ్లవానలు, ప్రకృతి వైపరిత్యాల వల్ల తమ పంటలు నష్టపోతే పంట నష్టం కింద పరిహారం ఎంత ఇవ్వాలి, ఏ పంటకు ఎంత పరిహారం, తదితర అంశాలపై కూడా విధివిధానాలు ఖరారు చేయాలని ఆధికారులను ఆదేశించారు.

అదే విధంగా రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాల మాఫీపై కూడా మంత్రులు చర్చించారు. ఇప్పటికే గతంలో రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి రుణాల రికవరీలో రైతులను వత్తిడి చేయవద్దని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలం లోపే ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు , ఎరువులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. రబీసీజన్‌లో రైతులు పండించిన పంటలు విక్రయానికి తేస్తే కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ధాన్యానికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరావుతోపాటు ఆర్థిక, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News