Sunday, September 15, 2024

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

తెలంగాణపై కుండపోతగా వర్షం కురిసింది.పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది.గద్వాల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దురు వ్యక్తులు మృతి చెందారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిజామాబాద్‌లోని రైల్వే బ్రిడ్జి వద్ద వరదలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది.బస్సులోకి నీరు చేరుతుండటంతో ప్రయాణీకులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు.

పోలీసులు, స్థానికులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు చేర్చారు. మరోవైపు బోధన్, ఆర్మూర్, బీర్కూర్, నవీపేట, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, సిరికొండ మండలాల్లో జోరు వాన కురిసింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా వర్షం కురువడం వల్ల ప్రధాన రహదారులపై నీరు చేరి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపోవడంతో రహదారులపై వరద నీరు ప్రవహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News