Saturday, September 21, 2024

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు!

- Advertisement -
- Advertisement -

నా కొడుకుని కాపాడంటూ ఓ కన్నతల్లి వేదన హృదయాన్ని కలిచివేస్తోంది. చికిత్స చేయించే స్థోమత లేక ఆమె కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. వివరాలలోకి వెళితే..సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల గ్రామానికి చెందిన వగలగాని మహేష్ కి రెండు కిడ్నిలు చెడిపోయాయి. అసలే పేదరికంలో ఉన్న మహేష్  తండ్రిని చిన్న తనంలోనే కోల్పోయాడు. దీంతో చిన్నతనంలోనే తల్లితో కలిసి బ్రతుకు దెరువు కోసం చెన్నై వెళ్లాడు. అక్కడ తల్లితో కలిసి కూలి పనిచేసి తన చెల్లి పెళ్లి చేశాడు. తల్లి ఇండ్లల్లో పని చేస్తుండగా,మహేష్ బియ్యం షాపులో పని చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత మహేష్ పెళ్లి చేసుకున్నాడు. అంతా సాఫీగా సాగిపోతున్న జీవితంలో మహేష్ కి రెండు కిడ్నీలు ఒకేసారి చెడిపోయాయి. చెన్నై లో పలు ఆసుపత్రిల్లో చూపించిన లాభం లేక సొంత గ్రామానికి వచ్చారు. హైదారాబాద్ గాంధీ హాస్పిటల్లో రెండు నెలల పాటు ఉన్న కిడ్నీ దొరక లేదు.

డయాలసిస్ నెలకి రెండు సార్లు చేయించుకోవాలి అని చెప్పడంతో అక్కడి నుండి సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి వచ్చారు. కొన్ని రోజులకు మహేష్ ఆరోగ్యం క్షీణించింది.దీంతో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఈ సమయంలో మహేష్ కు భార్య విడాకులు ఇచ్చింది. తల్లి కూలి పనులకు వెళ్తూ కొడుకుని కాపాడుకుంటూ వస్తుంది. ఇంతలో తల నొస్తుందని హన్మకొండలోని ఓ హాస్పిటల్ కి వెళ్తే బ్రెయిన్ లో మచ్చ ఉందని డాక్టర్లు చెప్పారు. కొద్ది రోజులకి కడుపులో మంట, ఛాతిలో నొప్పి వస్తుందని  ఆసుపత్రికి  వెళ్తే అక్కడ పరిక్షించిన డాక్టర్లు గుండె సాగిందని తెలిపారు. దిక్కులేని స్థితి లో కుంటంబం, కొడుకు నీ కాపాడుకోవడం కోసం తల్లి దాతల సహాయం కోసం ఎదురు చూస్తుంది.ప్రభుత్వం తరపున తనకు తగిన సాయం చేయాలిని ప్రభుత్వ అధికారులను వేడుకుంటుంది. దయచేసి కన్న తల్లి బాధ అర్థం చేసుకొని తగిన సహాయం చేయగలరు. Phone Pay,Google pay 9676218440

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News