Saturday, May 4, 2024

ఉద్ధవ్ పార్టీని చోరీ చేశారు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

ముంబై: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ముంబైలో మాజీ ముఖ్యమంత్రి, శివసేన(బిటి) అధినేత ఉద్ధవ్ థాక్రేను కలుసుకున్నారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా ఉన్నారు. శివసేన పార్టీ పేరును, చిహ్నాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే ఉద్ధవ్ థాక్రేను కేజ్రీవాల్ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శివసేనలో గత ఏడాది చీలిక ఏర్పడగా షిండే వర్గం బిజెపి మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భేటీ అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ… ఉద్ధవ్ థాక్రే పార్టీ తస్కరణకు గురైందని, పార్టీ పేరు, చిహ్నాన్ని చోరీ చేశారన్నారు. ఉద్ధవ్ తండ్రి బాల్ థాక్రే పులిలాంటి వ్యక్తని, పులి కడుపున పులే పుడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఉద్ధవ్‌కు న్యాయం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల మద్దతు ఆయనకే ఉన్నందున వచ్చే ఎన్నికల్లో ఉద్ధవ్ గెలుపు ఖాయమని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News