Thursday, April 25, 2024

హరిద్వార్‌లో రష్యన్ల తొమ్మిది రోజుల యజ్ఞం!

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో శాంతి కోసం గంగను పూజించిన రష్యన్ పౌరులు!

డెహ్రాడూన్: రష్యా నుంచి భారత్‌కు వచ్చిన 24 మంది రష్యన్ల బృందం హరిద్వార్ చేరుకుని ప్రార్థనలు చేశారు. కంఖాల్‌లోని రాజ్‌ఘాట్‌లో గంగా పూజ చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ జరగాలని మొక్కుకున్నారు. రష్యన్లు హిందువుల ఆచారం ప్రకారం పూజించడం ఇక్కడ విశేషం. వారు తమ దేశంలో, ప్రపంచంలో శాంతి నెలకొనాలని కోరుకున్నారు. వారు 11 రోజుల పాటు యజ్ఞం(హవన్), గంగా పూజలు నిర్వహించడం గమనార్హం. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలయి ఏడాది పూర్తయింది. కానీ యుద్ధం ఆగే సూచనలు కన్పించడంలేదు. ఇరు పక్షాలు మొండిగా సై అంటే సై అంటున్నాయి. ఈ కారణంగా ఇరు దేశ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. శాంతి ఒక్కటే మార్గంగా ఉంది.

భారతీయ ప్రాచ్య విద్యా సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ప్రతీక్ మిశ్రాపురి మాట్లాడుతూ‘ సనాతన్ ధర్మాన్ని అనుసరిస్తున్న 24 మంది రష్యన్లు హరిద్వార్ చేరుకున్నారు. వారికి పవిత్ర గంగమ్మ తల్లిపై విశ్వాసం ఉంది. ఇదివరలో కూడా వారు గంగానదిని సందర్శించుకున్నారు. ఇప్పుడు కూడా వీరంతా గంగానది వద్దకు చేరకుని పూజలు, యజ్ఞం చేశారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ఆగాలని అందరూ కోరుకున్నారు ’అని వివరించారు. రష్యా నుంచి వచ్చిన ఈ సమూహంలో ప్రొఫెసర్లు, వివిధ రంగాల ఇంజనీర్లు ఉన్నారు. వీరందరికి హిందూ దేశం మీద నమ్మకమే కాదు, సనాతన ధర్మంలో కూడా నమ్మకం ఉంది. వీరంతా భక్తి శ్రద్ధలతో హరిద్వార్‌లో గంగా నదిని ఆరాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News