Tuesday, April 30, 2024

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో సర్కారు దావఖానాలు మెరుగు పడ్డయ్

- Advertisement -
- Advertisement -

మంథని: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులతో మాటలు పడ్డ వై ద్యాధికారులు, సిబ్బంది నేడు బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రశంసలు అందుకుంటున్నారని, నాయకత్వం పనితీరును బట్టి ప్రభుత్వ అధి కారుల పనితీరు ఉంటుందని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.

బుధవార దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంథని మాతాశిశు కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఒకప్పుడు సర్కారు ఆసుపత్రికి పోవాలంటే భయం వేసేదని, నేడు సర్కారు వైద్యం అందరికి అందుబాటులో, సౌకర్యవంతంగా ఉపయోగంలోకి వచ్చిందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యంపై ప్రత్యేక దృష్టి సా రించి, పేద ప్రజలకు మెరైన వైద్యం ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ప్రజల ఆరోగ్యంలో భాగంగా అనాడు ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నేడు సీఎం కేసీఆర్ కొనసాగించడం ఆయన ఉదారతకు నిదర్శనమన్నారు. అలాగే 108, 104, 102 వాహ నాలను ప్రవేశపెఇ్ట ఆడబిడ్డ గర్భం దాల్చిన సమయం నుండి ప్రసవం జరిగి, ఇంటికి వెళ్లే సమయం వరకు అన్ని అందుబాటులో ఉంచేలా ఎన్నో పథకాలను అందిస్తూ, డబ్బులు అందజేస్తున్నారని తెలిపారు.

మంథని ఎమ్మెల్యేగా పని చేస్తూ నెలకు రూ.2.50 లక్షల జీతం తీసుకుంటూ పేద ప్రజల కోసం ఏనాడైనా రూపాయి ఖర్చు పెట్టాడని ప్రశ్నించారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితులపై అవగాహన ఉన్న నాయకుడిగా మాతా శిశు ఆసుపత్రిని తీసుకువచ్చామని అన్నారు. ఇటీవల ఆసుపత్రిలోకి వరదలు వస్తే ఎమ్మెల్యే ఏం చేశారని అడిగారు. 40 ఏళ్ల కుటుంబ పాలనలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోని ఆసుపత్రిల్లో సరిపడా వైద్యులు లేక ఇబ్బందులు పడ్డ రోజులు పోయి, ఆసుపత్రుల్లో వైద్యులు సమయానికి అందుబాటులో ఉన్న రోజులకు వచ్చామంటే సీఎం కేసీఆర్ కృషి పట్టుదల అని భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ అన్నారు. తాను ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవడం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందనడానికి నిదర్శనమన్నారు. వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల సేవా భావంతో మెలగాలని కోరారు. వైద్య రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News