Sunday, October 6, 2024

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

ఏన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఏన్డీయే ప్రభుత్వం కసరత్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వన్ నేసన్ వన్ ఎలక్షన్ నిర్వహణపై
బుధవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర క్యాబినెట్.. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ వేసింది.

తాజాగా ఈ కమిటీ.. జమిలి ఎన్నికలు నిర్వహించొచ్చని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ నివేదికకు ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు, కాంగ్రెస్ తోపాటు పలు రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News