Sunday, October 6, 2024

జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపిస్తూ జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఐదేళ్ళుగా ఆమెను జానీ మాస్టర్ లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది.

మైనర్ గా ఉన్నప్పటి నుంచే బాధితురాలపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు అందుకున్న పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జానీ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను నార్త్ ఇండియాలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్ళిన పోలీసులను బురిడి కొట్టించి జానీ మాస్టర్ పరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News