Saturday, June 3, 2023

శ్రీ అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆలయ మండపములో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.

అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించిన అర్చకులు మేళతాళములతో మంత్రోచ్చరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పూరివీదులలో ఊరేగించగా భక్తజనులు అమ్మవారిని దర్శించుకున్నారు. అద్దాల మండపములో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను తెలిపారు.శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో జరిగిన నిత్యపూజలు అభిషేకం,అర్చన, సుదర్శన నరసింహహోమం, నిత్యకల్యాణం, వెండి మొక్కు జోడు సేవ, సువర్ణ పుష్పర్చన తోపాటు శ్రీ సత్యనారాయణ స్వామి వత్ర పూజలలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొని తరించారు. కొండపై గల శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శివ దర్శనము,పూజలు, కొండ కింద శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

శ్రీవారి నిత్యరాబడి…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శుక్రవారం రోజున 19,75,742 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

సీతరాములకు నవరాత్రుల పూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి అనుబంద ఆలయం శివాలయంలో శ్రీరామ నవమి సందర్బంగా శ్రీసీతారామచంద్ర స్వామి వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రోజున ఉత్సవ వేడుకలో భాగంగా ఉదయం శివాలయంలో నిత్యారాధనల అనంతరము శ్రీసీతారామ హనుమంత్ మూలమంత్ర జపములు,దశశాంతి పంచసూక్త పారాయణములతో అభిషేకములు,ఆధ్యాత్మ రామాయణ పారాయణము, అష్టోత్తర శతనామర్చన పూజలు ఆలయ సిద్దంతి, వేదపండితులు, అర్చకులు నిర్వహించారు. సాయంత్రము ఉత్సవ వేడకలో భాగంగా నిత్యారాధనల అనంతరము శ్రీసీతారామ హనుమంత్ మూర్తులకు సహస్త్రనామర్చన,నివేదన,నీరాజనము, మంత్రపుష్పములు, తీర్ధప్రసాద వితరణ పూజలను గావించారు.ఈ పూజ వేడుకలలో ఆలయ చైర్మన్ నర్సింహ్మమూర్తి, ఈఓ గీత, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ స్వామివారిని దర్శించుకున్న పుడ్ కమిషన్ చైర్మన్

శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని తెలంగాణ రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్ కె. తిరుమల రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ స్వామి వారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనము చేయగా, ఆలయ అధికారి ప్రసాదములు అందచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News