Thursday, April 25, 2024

టర్కీలో జాడతెలియని బెంగళూరు బిజినెస్‌మెన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టర్కీలో ఇటీవలి భూకంపం తరువాతి దశలో ఓ భారతీయుడి జాడ కన్పించడం లేదు. ఈ వ్యక్తి బెంగళూరు నుంచి టర్కీకి వ్యాపార పనులపై వెళ్లారు. కాగా టర్కీలో మొత్తం మీద 3 వేల మంది వరకూ భారతీయులు నివసిస్తున్నారు. వీరు సురక్షితంగానే ఉన్నారు. ఇక భూకంప తాకిడి ప్రాంతాలలో చిక్కుపడ్డ పది మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందని బుధవారం ఇక్కడ అధికార వర్గాలు తెలిపాయి. టర్కీలోని అదానా ప్రాంతంలో భారతదేశం తరఫున ఓ సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. పది మంది శిథిలాల ప్రాంతాలలో ఉన్నట్లు అయితే వారికి ఎటువంటి ప్రాణనష్టం లేదని నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరుకు చెందిన వ్యక్తి పరిస్థితి గురించి ఆయన కుటుంబం వారితో ఆయన పనిచేసే బెంగళూరు కంపెనీ అధికారులతో మాట్లాడుతున్నట్లు స్థానిక అధికారి సంజయ్ వర్మ తెలిపారు. ఇస్తాంబుల్ , సమీప ప్రాంతాలలో దాదాపు 1850 మంది వరకూ భారతీయులు ఉన్నారు. అంకారాలో 250 మందివరకూ స్థిరపడ్డారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాలలో ఉంటున్నారు. ఇస్తాంబుల్ చారిత్రక, పురాతన నగరం కావడంతో పలువురు ప్రముఖ హీరోలు తమ కుటుంబాలతో ఇక్కడికి వచ్చి వెళ్లుతుంటారు. పలు తెలుగు, హిందీ సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. దోస్త్ పథకంలో భాగంగా టర్కీ , సిరియాలకు సాయం అందిస్తున్నట్లు, ఇందులో భాగంగా సహాయక సామాగ్రి, వైద్య పరికరాలు, ఔషధాలు , సహాయక సిబ్బందిని తరలించినట్ల విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News