Saturday, April 20, 2024

రాజస్థాన్ అసెంబ్లీలో గోలగోల…

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఆర్థిక మంత్రి కూడా అయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం అసెంబ్లీలో గత ఏడాది బడ్జెట్ పాఠాన్ని చదివారు. ఆయన దాన్ని చదువుతున్నప్పుడు పార్టీ నాయకులు, ఇతర మంత్రులు ఆపమని కోరారు. ఎందుకంటే అది బాగా తెలిసినదేననిపించింది వారికి. అయినప్పటికీ గెహ్లాట్ కొద్దిసేపు చదవడాన్ని కొనసాగించారు. అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం చీఫ్ విప్ మనీశ్ జోషి ఆపేంత వరకు గెహ్లాట్ ఏడు నిమిషాల పాటు గత ఏడాది బడ్జెట్ పాఠాన్నే చదివారు. అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. దాంతో ప్రతిపక్ష ఎంఎల్‌ఏలు గోలగోల చేశారు.

ఎప్పుడయితే ముఖ్యమంత్రి గత ఏడాది బడ్జెట్‌లోని కొన్ని పేరాలు చదివారో అప్పుడు స్పీకర్ జోషి ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగనివ్వండి అంటూ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో రభస చోటుచేసుకున్నాక సభను 30 నిమిషాలపాటు వాయిదావేశారు. రాజస్థాన్ అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి సభ వాయిదా పడింది.

తర్వాత మళ్లీ సభ సమావేశం అయ్యాక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వివరణ ఇచ్చారు. తాను గత బడ్జెట్ తాలూకు ఒక్క పేజీనే చదివానన్నారు. తర్వాత ఆయన బిజెపి ఎంఎల్‌ఏలు నిరసనల నడుమ 202324 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష ఎంఎల్‌ఏలకు తన మిగతా బడ్జెట్‌ను పూర్తిచేయనివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా శాసనసభలోని ప్రతిపక్ష నాయకుడు గులాబ్‌చంద్ కటారియా తప్పుడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు క్షమాపణ చెప్పమని అడిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News