Saturday, April 27, 2024

యాంటీ ఓటుతో ఫైటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆదివారం తేలనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకంగా 2024 ‘సెంటర్ పాయింట్’ కానున్నాయి. ఇదే దశలో ప్రాంతీయ స్థాయి నేతల బలాబలాలకు కీలకం కానున్నాయి. విస్తరించుకుని పోయిన రెండు ప్రధాన పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌ల ప్రజాస్వామిక రాజరికంలో ప్రాంతీయ స్థాయి నేతలు వాటి సామంతులు అవుతున్నారు. ఇప్పటి ఎన్నికలు కేవలం ప్రాంతీయ స్థాయిలో పార్టీల సత్తా చాటుకునే కీలక ఘట్టాలే అనుకోరాదు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బిజెపి దీని మిత్రపక్ష కూటమి ఎన్‌డిఎ, కాంగ్రెస్ అనుబంధ ఇండియా వేదికకు సవాలుగానే మారుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు ఎక్కువగా దృష్టి సారించారు. ఈ ఎన్నికలలో ప్రాంతీయ స్థాయి నేతల భవితవ్యం స్పష్టం కానుంది. వీటిలో మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పవర్‌లో సాగుతోంది.ఈ రెండు రాష్ట్రాల్లోనూ సిఎంలుగా ఆయా రాష్ట్రాల్లో దిట్టమైన నేతలే సిఎంలుగా ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోట్ సిఎంలుగా సత్తా చాటుకున్నారు. విచిత్రరీతిలో ఈ ఇద్దరూ వారివారి పార్టీలలో అసమ్మతిని రగిలించుకుని ఉన్నారు. పైగా వీరిరువురూ ఎన్నికలలో అత్యంత ప్రధానమైన యాంటి ఇంక్యుంబెన్సీ అంటే అధికార వ్యతిరేక ఓటు వేటు పడగల నీడలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యధికంగా ఇప్పుడు తమ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలపైనే ఆధారపడుతున్నారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ నుంచి మరో వైపు పార్టీలో ఆయన పట్ల అసమ్మతితో ఉన్న వారినుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకూ శివరాజ్‌ను కొనియాడుతూ వచ్చినా బిజెపి అగ్రనాయకత్వం, ఆయనను తమ పార్టీ సిఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. పైగా కేంద్ర మంత్రులను, ఎంపిలను కూడా బరిలోకి దింపి పరోక్షంగా సవాళ్లు ఎక్కువ చేసింది. సమిష్టి నాయకత్వం ఉంటుందనే సంకేతాలు వెలువరించింది. అయితే వీటిని పట్టించుకోకుండా మామ అని అందరి మన్ననలు పొందే చౌహాన్ ఇప్పుడు ఈ ఎన్నికలలో గెలిస్తే సుదీర్ఘకాలపు సిఎంగా రికార్డులోకి వెళ్లుతారు. 2005 నుంచి ఆయన అధికారంలో ఉంటూ ఉన్నారు. అయితే మధ్యలో 15 నెలల స్వల్ప విరామంలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ అధికారం సాగింది.

రాజస్థాన్‌లోనూ గెహ్లోట్‌కు ఇదే పరిస్థితి
రాజస్థాన్‌లో కూడా సిఎం గెహ్లోట్ ప్రజా సంక్షేమ పథకాల ప్రచార బలంతో ఉన్నారు. అయితే అధికార వ్యతిరేక ఓటు, పార్టీలో సచిన్ పైలట్ నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. పైగా ఈ రాష్ట్రంలో ఓటర్లు ప్రతిసారి పార్టీల పవర్ దించుతారనే పద్ధతి ఉంది. మూడు దశాబ్దాలుగా ఇది సాగుతోంది. గెహ్లోట్ మూడుపర్యాయాల సిఎంగా ఉన్నారు. ఇక్కడ బిజెపి ఇప్పుడు మరో ఛాన్స్‌కు అదును కోసం చూస్తోంది. ప్రత్యేకించి మాజీ సిఎం వసుంధరా రాజే పార్టీ సిఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది కానీ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తే ఇతర ప్రత్యామ్నాయ నేతల గురించి కూడా బిజెపి వెళ్లుతుంది.

ఈ ఎన్నికలలో ఏడుగురు బిజెపి ఎంపీలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి బిజెపి తరఫున ఏడుగురు ఎంపిలు స్థానిక బరిలోకి దిగారు. వీరిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఒక్కరుచొప్పున , ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు, తెలంగాణలో ముగ్గురు ఎంపిలు పార్టీతరఫున బలం పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఎన్నికలలో వయస్సు మళ్లుతున్న యువ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, ఇటు సచిన్ పైలట్‌ల రాజకీయ భవితవ్యం ఏమిటనేది కూడా తేలనుంది. ఇందులో సింధియా కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వెళ్లిన నేత, పైలట్ కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ సిఎం అశోక్ గెహ్లోట్‌ను ధిక్కరించిన రికార్డు కలిగిన నేత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News