Friday, April 26, 2024

12 మంది రష్యన్ మిషన్ దౌత్యవేత్తలపై అమెరికా వేటు

- Advertisement -
- Advertisement -

US expels 12 Russian diplomats

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి రష్యా మిషన్ నుంచి పనిచేస్తున్న 12 మంది దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది. వీరు గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు అమెరికా ఆరోపించింది. దీనిపై రష్యా తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇది అత్యంత శత్రుభావంతో తీసుకున్న చర్యగా వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఉన్న దేశమైన అమెరికా తన కట్టుబాట్లను స్థూలంగా ఉల్లంఘించడమేనని ఆరోపించింది. అమెరికా లోని రష్యా దౌత్యకార్యాలయ శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా దీనిపై పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ 12 మందిని బహిష్కరిస్తున్నట్టు తనకు టెలిఫోన్ ద్వారా తెలియజేశారని, మార్చి 7 నాటికి వీరు తమ విధులను విడిచిపెట్టి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితికి అమెరికా మిషన్ అధికార ప్రతినిధి ఒలివియా డాల్టన్ మాట్లాడుతూ రష్యన్ మిషన్ లోని 12 మంది ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌ను బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించినట్టు ఐక్యరాజ్యసమితికి, దాని రష్యన్ శాశ్వత మిషన్‌కు అమెరికా తెలియజేసినట్టు చెప్పారు. వీరు అమెరికాలో నివసించేందుకు గల ప్రత్యేక అధికారాలను దుర్వినియోగపర్చారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంతో కుదిరిన ఒప్పందం ప్రకారం తాము ఈ చర్య తీసుకొంటున్నామని చెప్పారు. అనేక నెలలుగా వీరు అమెరికా భద్రతకు ప్రతికూలమైన గూఢచర్య కార్యకలాపాల్లో నిమగ్నమైనందున పర్యవసానంగా ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News