Saturday, April 27, 2024

బాబ్లీ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేత…

- Advertisement -
- Advertisement -

Bably Project Gates Lifted today

 

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు ప్రతిఏటా మార్చి ఒకటిన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయాల్సివుంది. కేంద్ర జలవనరుల సంఘం నియమించిన పర్యవేక్షక కమిటీ అధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారుల బృందం మంగళవారం నాడు బాబ్లీ గేట్లు తెరిపించింది. దీంతో ఎగువభాగాన ఉన్న నీరు బాబ్లీ ప్రాజెక్టు ద్వారా దిగువన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కుందుర్తి వద్ద త్రీవేణి సంగమం జలకళను సంతరించుకుంది.బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత ద్వారా ఒక్కసారిగా గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరగటంతో అధికారులు బాబ్లీదిగువన నదిపరివాహక ప్రాంత లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

తీర ప్రాంత రైతులు ,మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని, నదిని దాటేందకు ప్రయత్నాలు చేయరాదని హెచ్చరిస్తున్నారు. బాబ్లీ గేట్ల ఎత్తివేత ద్వారా తాగునీటి అవసరాల నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలోకి 0.6టిఎంసిల నీటిని వదులు తున్నారు. మహాశివరాత్రి రోజునే గోదావరినదిలో నీటి ప్రవాహాలు పెరగటం ,తీర ప్రాంత గ్రామాల ప్రజలు గోదావరి జలాలతో పుణ్యస్నానాలు చేసి శివాలయాల్లో మల్లన్నను దర్శించుకుంటున్నారు. బాబ్లీగేట్లు ఎత్తి నీటి విడుదల చేసిన కార్యక్రమంలో కేంద్ర జలసంఘం ఇఇ శ్రీనివాసరావు, తెలంగాణ రాస్ట్ర నీటిపారదుల శాఖ ఇఇ చౌగల, గడతరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News