Friday, April 26, 2024

పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

- Advertisement -
- Advertisement -
Special classes for tenth students
ఈఏడాది ఫలితాల్లో ముందువరుసలో ఉండేందుకు విద్యాశాఖ కసరత్తు
గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ స్కూళ్ల నుంచి 25వేలు విద్యార్ధులు పరీక్షలకు సిద్దం
రెండు వారాల్లో సిలబస్ పూర్తి చేసి, వెనకబడిన విద్యార్థులపై దృష్టి

హైదరాబాద్: నగరంలో ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. చదవుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారు చదువుల్లో రాణించేలా శ్రద్ద తీసుకుంటున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఈవిద్యాసంవత్సరానికి 70శాతం సిలబస్‌తోనే పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరిలోనే సిలబస్ పూర్తి చేయాల్సి ఉండగా సంక్రాంతి పండగ సెలవులు, ధర్డ్‌వేవ్‌తో సెలవులు పొడిగించడంతో ఆశించిన స్దాయిలో పాఠాలు పూర్తి కాలేదు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీషు, హిందీ,సోషల్ సిలబస్ పూర్తిగా, గణితం, సైన్సు సబ్జెక్టులో ఇంకా బోధించాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు బడుల్లో అన్ని సబ్జెక్టులు పూర్తి చేసి, ఈనెల రివిజన్ తరగతులకు సిద్దమైయ్యారు. గత రెండేళ్లు పరీక్షలు నిర్వహించకపోవడంతో బడులు ప్రారంభించేందుకు విద్యార్ధులను ఆకట్టుకునేందుకు అత్యధిక ర్యాంకుల సాధించి, నగరంలో టాప్ వరుసలో ఉన్నామని ప్రచారం ఊదరగొట్టేవారు. ఈసారి పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తుండటంతో విద్యార్ధులందరు ఉత్తీర్ణత సాధించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వారిని ఢోకొట్టి ఉత్తీర్ణత శాతం పెంచుకోవాంటే సిలబస్ వీలైనంత త్వరగా పూర్తి చేసి, అదే విధంగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి,అందరు ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు ప్రయత్నాలు వేగం చేసినట్లు వెల్లడిస్తున్నారు.

ప్రతి ఏటా సర్కార్ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాల తగ్గేవి, ఈవిద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఇదే తరహాలో ప్రభుత్వ బడుల వైపు విద్యార్ధులు మొగ్గుచూపేందుకు పదిలో ఫలితాలు పెరిగితే ఇంకా పెద్ద ఎత్తున ఆడ్మిషన్లు పెరుగుతాయని ప్రధానోఫ్యాధ్యాయులు భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు మే 10 నుంచి 17వ తేదీవరకు నిర్వహిస్తుండటంతో గడువులోగా విద్యార్థులు పరీక్షలకు సిద్దం చేస్తామంటున్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్‌లో ప్రభుత్వ పాఠశాల్లో 7800మంది, రంగారెడ్డి జిల్లాలో 9040మంది, మేడ్చల్ జిల్లాలో 8450మంది పరీక్షలు రాయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీరందరు కళాశాల చదువులు చదివేలా తమ అనుభవంతో పాఠాలు బోధించి ఈసారి ప్రకటించే పదోతరగతి ఫలితాల్లో ముందు జాబితాలో ఉంటామని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News