Sunday, August 3, 2025

ఎపి విభజన చట్టానికి బనకచర్ల వ్యతిరేకం: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రం నుంచి ప్రతిపాదన ఇవ్వటం వల్లనే కేంద్రం బనకచర్లను వ్యతిరేకించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy) తెలిపారు. కాళేశ్వరాన్ని మంథని నియోజకవర్గ పరిధిలో కట్టారని ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని అన్నారు. రామగుండం నియోజకవర్గం అంతర్గంలో రామగుండం ఎత్తిపోతలలను మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ..బనకచర్ల విషయంలో ఎపి మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని ఇప్పటికే పలుమార్లు చెప్పామని పేర్కొన్నారు.

ఎపి విభజన చట్టానికి బనకచర్ల వ్యతిరేకమని తెలియజేశారు. బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు (False signs people) ఇస్తున్నారని, రూ. లక్ష కోట్లను గత ప్రభుత్వం వృథా చేసిందని మండిపడ్డారు. రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత- చేవెళ్ల కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో లేకపోయిన రికార్డు స్థాయిలో వరి పంట పండిందని కొనియాడారు. గోదావరి పరివాహక ప్రాంతాలకు పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తీసుకొస్తామని, ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టాలని గతంలో నిర్ణయం జరిగిందని తెలియజేశారు. దాన్ని అమలు చేస్తామని అన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకు వెళ్తానని మాజీ సిఎం కెసిఆర్ గతంలో అన్నారని చెప్పారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటితో పాటు కొత్త ప్రాజెక్టులను గోదావరిపై కడతాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News