Saturday, July 27, 2024

కేదార్ నాథ్ మందిరం సమీపంలో మొబైల్ ఫోన్లపై నిషేధం

- Advertisement -
- Advertisement -

చార్ ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్నది. కేదార్ నాథ్ మందిరం సమీపంలో 50 మీటర్ల మేర మొబైల్ ఫోన్లను ఉపయోగించకుండా నిషేధం విధించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈ నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని, జరిమానాలను ఖచ్చితంగా అమలు చేయనున్నట్టు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి రాధా రతూరీ ప్రకటించారు.

చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నాలుగు పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ‘ఆపరేషన్ మర్యాద’ పేరిట ఉత్తరాఖండ్ పోలీసులు మార్గదర్శకాలను జారీ చేశారు. హిందూయిజంలో ఛార్ ధామ్ యాత్రకు ఓ విశిష్టత ఉంది. ఈ పవిత్ర యాత్ర ద్వారా ఆధ్యాత్మికత, మోక్ష మార్గాలు దక్కుతాయని హిందువులు భావిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News