Saturday, June 1, 2024

టిపిసిసి రేసులో నేను కూడా ఉన్నా: మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

సామాజిక కోణంతో సంబంధం లేకుండా సమర్థులకే రాష్ట్ర అధ్యక్ష పదవి
ఎమ్మెల్సీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్:  టిపిసిసి రేసులో తాను కూడా ఉన్నానని ఎమ్మెల్సీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు కొత్త చీఫ్‌ను నియమిస్తుందని ఆయన అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారన్నారు. సామాజిక కోణంతో సంబంధం లేకుండా సమర్థులకే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందన్నారు.

అనుభవం, సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని పిసిసి చీఫ్ ఎంపిక ఉంటుందన్నారు. బిఆర్‌ఎస్ నేతలు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారన్నారు. రైతులకు సంకెళ్లు వేసింది మీరు కాదా? మీ పాలనలో రైతులకు గజ దొంగల్లా బేడీలు వేశారని ఆయన ఆరోపించారు. పదేళ్లల్లో రైతులకు మీరు ఏం చేశారు? నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగింది? వరి వేస్తే ఉరి అన్నది ఎవరు? రైతులను వరి సాగు వద్దని చెప్పి కెసిఆర్ తన ఫాంహౌస్‌లో వరి వేసుకోలేదా? కెసిఆర్ మాదిరిగా రైతుల విషయంలో మోసం చేసే సర్కార్ మాది కాదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News