Friday, May 3, 2024

తెలంగాణకు గుదిబండ రెడీ

- Advertisement -
- Advertisement -

సాంకేతికంగా వివిధ అంశాలపై క్షేత్ర స్థాయి సర్వేలు నిర్వహించి రూపొందించిన సాగునీటి పథకం డిపిఆర్‌లను మార్చి.. ప్రాజెక్టులకు కీలక అంశాలతో కూడిన అనుమతులు ఇచ్చే కేంద్ర జలసంఘం, పర్యావరణ అటవీ సంస్థలు, గ్రీన్‌ట్రిబ్యునళ్లు తదితర అధీకృత సంస్థలను ఏమార్చి ఏపి ప్రభుత్వం ఎట్టకేలకు వెలిగొండ పథకాన్ని తుదిదశకు చేర్చింది. డిసెంబర్ చివరినాటికి ఈ పథకానికి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని ప్రకటించింది. వచ్చే వర్షాకాలంలో జూ న్ నుంచి కృష్ణానదీ జలాలను వెలిగొండ ప్రాజెక్టుకు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. కృష్ణానదీ జలాల్లో ఏ విధమైన హక్కులు లేకపోయినా వరద మాత్రమే వినియోగించుకుంటామని వెలిగొండ సాగునీటి రూపొందించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా 43.5 టిఎంసిలను మాత్రమే వినియోగించుకునేందుకు డిపిఆర్ రూపొందించింది. ఆ కేంద్ర జలసంఘంతో పాటు ఇతర అధీకృత సంస్థల ద్వారా అనుమతులు పొందింది.

తీరా పనులు పూర్తి కావచ్చే సరికి ఇప్పడు 43.5 బదులుగా 53.5 వినియోగించుకునేందుకు సిద్ధమవుతోంది. నల్లమల అడవుల్లో కొల్లంవాగు కృష్ణానదీలో కలిసే ప్రాంతం వద్ద శ్రీశైలం జలాశయం నుంచి వర్షాకాలం నదికి వరదలు వచ్చే సమయంలో కృష్ణాజలాలు వృథాగా సముద్రం పాలు కాకుండా అందులోనుంచి రోజుకు 11584 చొప్పున 45రోజుల పాటు నీటిని వెలిగొండ పథకానికి విడుదల చేయాలని డిపిఆర్‌లో పొందుపరిచి అందుకు అవసరమైన అనుమతలు పొందింది. అయితే ఇప్పడు ఈ పథకం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని డ్రా చేసుకునే 45రోజుల కాలాన్ని కేవలం 15రోజులకు తగ్గించింది. కృష్ణానదికి వరదల సమయంలో కేవలం 30రోజలు వ్యవధిలోనే వెలిగొండకు నీటిని విడుదల చేసే విధంగా అందుకు అనువైన సామర్థ్దంతో కాలువల పనులు విస్తరించింది. డిపిఆర్ ఇచ్చిన అనుమతి ప్రకారం 43.5 నీటివినియోగాన్ని మరో 10 టిఎంసిలకు పెంచింది. వెలిగొండ పథకం ద్వారా మొత్తం 53.8 టిఎంసిల నీటిని నల్లమల సాగర్‌లో నిలువ చేసేందుకు అసరమైన పనులు చేపట్టి వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి.

డిసెంబర్ నాటికి టన్నల్ సిద్ధం:
వెలిగొండ టన్నెల్స్ త్రవ్వకాల పనులు చివరిదశకు చేరుకున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల నిడివిన రెండు సమాంతర టన్నల్స్ ద్వారా నీటిని డ్రా చేసుకునేందుకు అవసరమైన ఈ పనల్లో వేగం పెంచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. టన్నెల్‌లో రోజుకు -4.12 మీటర్లు చొప్పున పూర్తి చేయిస్తూ గత ఏడాదిగా పనులను పరుగులు తీయిస్తున్నారు. రెండవ టన్నెల్ రోజుకు 4.35 మీటర్ల చొప్పున పనులు జరుగుతున్నాయి. ఇంకా మిగిలిన 335 మీటర్ల టన్నల్ తవ్వకం పనులు డిసెంబర్‌లో పూర్తికానున్నాయి.
శ్రీశైలానికి కృష్ణా వరద జలాల చేరిక ఆలస్యం!
రానున్న వర్షాకాలంలో ఎగువ నుంచి కృష్ణాజలాలు శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరడమే ఆలస్యం అన్నంతగా వెలిగొండ పథకం ప్రారంభానికి ఏపి ప్రభుత్వం ఆత్రత పడుతోంది. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల జూన్ నుంచే నీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

4.37లక్షల ఎకరాలకు సాగునీరు
వెలిగొండ పథకంలో భాగంగా ఆంధప్రదేశ్‌లో కొత్తగా 4.37లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 840 అడుగుల స్థాయి నుంచి ఆ పైన వచ్చే నీటిలో నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించనున్నారు. కొత్తగా 54 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో కృష్ణానదీ జలాలను నిల్వ చేసి ఆ నీటిని ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4.37,300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. అంతే కాకుండా ఆ మూడు జిల్లాల పరిధిలో ఉన్న 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ సాగునీటి పథకానికి 2004, అక్టోబర్ 27న దీనికి శ్రీకారం చుట్టారు. సుమారు రెండు దశాబ్దాల ఆపసోపాలు పడుతూ వచ్చిన వెలిగొండ పథకం పనులను జగన్ ప్రభుత్వం పట్టాలపైకెక్కించి జెట్ స్పీడ్‌తో ముందుకు నడిపిస్తూ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News