Monday, April 29, 2024

ఈ బడ్జెట్‌తో దేశ ప్రజలకు పైసా ఉపయోగం లేదు

- Advertisement -
- Advertisement -

Vemula prashanth reddy fires on Union Budget 2022

రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదు
బిజెపి, కేంద్రం, ప్రధాని మోదీ
తెలంగాణకు శత్రువుల వ్యవహహారిస్తున్నారు
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022,-23 వార్షిక బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు పైసా ఉపయోగం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ దేశ ప్రజలను మోదీ ప్రభుత్వం దగా చేసిన బడ్జెట్‌గా మంత్రి అభివర్ణించారు. రూ.40 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు శత్రువుల వ్యవహహారిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోవడం చూస్తుంటే కేంద్రం వ్యవహారిస్తున్న తీరు వివక్షకు దర్పణం పడుతోందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లెక్కలు చెప్పి ప్రజలను మభ్య పెట్టడం తప్ప ఎలాంటి ఉపశమనం కలిగించ లేదని మంత్రి వివరించారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌లో నిజామాబాద్‌కు పసుపు బోర్డు హామీని నెరవేర్చ లేకపోయినా నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఇకపై బడాయి మాటలు మానుకొని ఇంట్లో కూర్చోవాలని హితవుపలికారు.

రాష్ట్ర బిజెపి నాయకులు భేషరతుగా….

ఎంపి అరవింద్‌ను ఢిల్లీలో సొంత పార్టీయే పట్టించుకోలేదని ఈ బడ్జెట్‌తో ఆ విషయం తెలిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణకు పైసా ప్రయోజనం లేక పోయినందున రాష్ట్ర బిజెపి నాయకులు భేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులను, రైతులను, సామాన్య ప్రజలను నిలువునా మోసం చేసిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సబ్ కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల పాలిట సబ్ కా వినాస్ అన్న రీతిలో వ్యవహారిస్తున్నారని దీనికి బడ్జెట్ కేటాయింపులు నిదర్శనమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News