Sunday, April 28, 2024

హరితహారం.. సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పచ్చదనం పరిఢవిల్లాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దంగా హరితహరం నిలుస్తోంది. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలన్న ఆయన ఆకాంక్షకు ప్రతిబింబంగా హరితహారం దినదిన ప్రవర్థనమానమైంది. రాష్ట్రమంతా పచ్చదనంతో కలకలాడుతోంది. ఇందుకు సంబంధించిన నివేదికలే ఇందుకు అక్షర తార్కాణాలుగా నిలుస్తున్నాయి. ఆ అద్భుతమైన నివేదికతో తన హృదయం ఉప్పొంగిందని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. నివేదికలో గత పదేళ్లలో ఒక్క హైదరాబాద్‌లోనే 147శాతం పచ్చదనం పెరుగుదల కనిపించడమంటే ఆషామాషీ కాదు. ఈ క్రెడిట్ అంతా సిఎం కెసిఆర్‌దేనని ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. సిఎం కెసిఆర్ మానసపుత్రికగా పేర్కొనే హరితహారం నేడు రాష్ట్రంలో విస్తరించిందనడంలో సందేహం లేదు. ఇదే హరితహారం కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. పర్యావరణం పరిరక్షణ పదికాలాల పాటు పదిలంగా ఉండేందుకు.. రాబోయే తరాలకు ఉపయుక్తంగా ఉండే విధంగా సిఎం కెసిఆర్ మదిలోంచి హరితహారం ఉద్భవించిందన్నారు. ప్రతి పనిని ప్రారంభించడం కాదు.. దానిని చివరికంటా (గోల్ చేరేవరకు) శ్రమించి నిలబెట్టాలన్న సిఎం కెసిఆర్ సత్సంకల్పమే నేడు హరితహారం విజయవంతమయ్యేందుకు కారణమయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పది సంవత్సరాల వ్యవధిలో హరితహారం కార్యక్రమం ఇంతగా సక్సెస్‌కావడం వెనుక సిఎం కెసిఆర్ ఆనాడు దీని ఆవిర్భావానికి చేసిన కృషి కూడా నిదర్శనమన్నారు. పని చేయడమే కాదు.. దాని ఫలాలు సమానంగా వ్యాప్తి చెందాలన్న సిఎం ఆకాంక్షలకు హరితహారం సక్సెస్ ప్రత్యక్ష తార్కాణమని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సిఎం కెసిఆర్ దార్శనికతకు నిలువుటద్దమని ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ కీర్తించారు.

147 percent greenary decadal growth in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News