Saturday, April 20, 2024

తెలుగువాళ్ళు ఎక్కడున్నా కలిసి ఉండాలి: వెంకయ్య నాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. పాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన జరిగిందన్నారు. ఇతర భాషల మోజులో పడి మాతృభాషను వదులుకోవద్దన్నారు. మాతృభాషలోనే చదువుకున్న వాళ్ళలో అనేకమంది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత పదవులను పొందారన్నారు. ఆదివారం హైదరాబాద్ శివారు నార్సింగ్‌లో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం జరిగింది. దీనిలో అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనిక దేశమైన ఇండియాను ఇంగ్లీష్ వాళ్ళ దోచుకుపోయారని అన్నారు. మరో పదేళ్ళలో దేశం బలమైన ఆర్ధికశక్తిగా మారబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానంలో మాతృబాషను కాపాడుకునే వీలు కల్పించిందని చెప్పారు. తాను రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే మాతృభాషలో మాట్లాడే అవకాశం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చట్టసభలు, కోర్టుల్లో కూడా మాతృభాషలో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. తాను పదవీ విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదన్నారు. తన అనుభవాలతో పాటు అన్ని విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై బిబిసి ఛానల్ ప్రసారం చేసిన డాక్యూమెంటరీ ప్రధానితో పాటు దేశాన్ని అవమానర్చిందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News