Thursday, April 25, 2024

శుభ్‌మన్ నిక్‌నేమ్ పెట్టిన సునీల్ గవాస్కర్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడు. గిల్ ను అభినందిస్తున్నవారిలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా చేరాడు. గిల్‌కు స్మూత్‌మన్ అని నిక్‌నేమ్ పెట్టినట్లు గవాస్కర్ తెలిపాడు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్ డబుల్ సెంచరీ సాధించిన ఎనిమిదో భారత బ్యాటర్‌గా గిల్ కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో గిల్ 208పరుగులతో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 23ఏళ్ల గిల్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో 71.38 సగటుతో కొనసాగుతున్నాడు.

భారత్ తరఫున 20-వన్డేలు ఆడిన గిల్ మూడుసార్లు మూడంకెల స్కోరును నమోదు చేశాడు. కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో 40పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన అనంతరం శుభ్‌మన్ గిల్‌తో భారత లెజెండ్ గవాస్కర్ మాట్లాడుతూ..గిల్‌కు నిక్‌నేమ్ పెడుతున్నట్లు తెలిపాడు. శుభ్‌మన్ గిల్‌ను స్మూత్‌మన్ గిల్‌గా పిలవనున్నట్లు తెలిపాడు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపాడు. కాగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలోనే గిల్ 1000పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. 19ఇన్నింగ్స్‌ల్లోనే వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఈక్రమంలో అత్యంత వేగంగా వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు.

విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ 24ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 1000పరుగులు మైలురాయికి చేరుకోగా గిల్ 19ఇన్నింగ్స్‌లోనే సాధించాడు. అంతర్జాతీయ క్రికెటర్లలో ఈ ఘనత సాధించిన క్రికెటర్లలో గిల్ పాక్ బ్యాటర్ ఇమామ్ ఉల్ కలిసి రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈక్రమంలో గిల్ విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్, బాబర్, కెవిన్ పీటర్సన్, జోనాథన్, క్వింటన్ డికాక్, వాన్‌డెర్ డస్సెన్‌లను అధిగమించాడు. వీరంతా 21ఇన్నింగ్స్‌ల్లో 1000పరుగులు సాధించారు. కాగా పాకిస్థాన్‌కు చెందిన ఫఖార్ జమాన్ 18ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు పూర్తిచేసుకుని ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News