Wednesday, May 1, 2024

నక్సల్ నేపథ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విరాటపర్వం’. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల మీడియాతో మాట్లాడుతూ “నాకు తెలిసిన జీవితాన్ని చెప్పాలని, చరిత్రలో దాగిన కథలు చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమానే ‘విరాటపర్వం’. తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఇక్కడ జరిగిన పరిణామాలు దేశ రాజకీయాలని ప్రభావితం చేశాయి. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరగడం వల్లనే విభిన్నమైన ‘విరాటపర్వం’ సినిమా చేయగలిగాను. యదార్థ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని తీశాం. ‘విరాటపర్వం’లో ఒక అందమైన ప్రేమకథ చెబుతున్నాం. 1990లోని రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇది అందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. నక్సల్ నేపధ్యంలో వస్తున్న తొలి ప్రేమకథ ఇది. సాయి పల్లవికి పది నిమిషాలు కథ చెప్పగానే ఓకే చేశారు. రానా ఈ చిత్రానికి నిర్మాత కూడా. ఆయన చాలా గొప్ప మనసుతో చాలా నిజాయితీతో మనం తీసింది ప్రేక్షకుల వద్దకు అంతే నిజాయితీగా తీసుకువెళ్తే ఆదరిస్తారని చెప్పారు”అని అన్నారు.

Venu Udugula about ‘Virata Parvam’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News