Thursday, April 18, 2024

చంపుతున్న చలి… గుండె జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

 

నగరంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్న సంగతి మనకు తెలిసిందే. అదే సమయంలో తెల్లవారు ఝామున పొగమంచు, చల్లనిగాలులు కూడ ఎక్కవయ్యాయి. అయితే ఈ సమయంలో వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేయడానికి పార్కులు, లేక బయట తిరిగినా సరే గుండెపోటు వచ్చే ప్రమాదముందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎక్కువగా గుండెజబ్బులతో బాధపడేవారు, అధిక రక్తపోటు, మధుమేహంతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నవారు చలికాలం అసలు ఉదయం పూట వాకింగ్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. చలికాలంలో శరీరంలోని రక్తనాళాలన్నీ దగ్గరవుతాయి.

అదే సమయంలో గుండెకు రక్తా న్ని సరఫరా చేసే కలోనరీ కూడా దగ్గరవడంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. మిగితా రోజుల్లో పోలిస్తే శీతాకాలంలోనే, అందులోనూ ఉదయం పూటే ఎక్కువగా గుండెపోటు రావడం చూస్తుంటామని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడేవారికి ఇప్పుడు కాస్త గడ్డుకాలమేని వైద్యులు అంటున్నారు. వారికి ఈ సమయంలో చల్లగాలి వల్ల ముక్కులు బిగిసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువవుతాయి. అలర్జీ సమస్యలు ఈ సమయంలో పీడిస్తుంటాయి. ఆస్తమాతో బాధపడేవారు కూడా పార్కులు లేక ఇతర చెట్లు ఉన్న ప్రదేశానికి వెళ్లినప్పుడు కొన్ని రకాల చెట్ల వాసనలు, వాటి పూల నుంచి వచ్చే పుప్పొడి రేణువుల వాసనల వలన కూడా అలర్జీలాగా వచ్చి ఆస్తమా పెరుగుతుంది. కావున అలర్జీ వాసనలు, లేక అలాంటి అస్వస్థతకు గురిచేసే అలర్జీ కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News