Saturday, April 20, 2024

చలికాలంలో చర్మ సంరక్షణ కోసం జాగ్రత్తలు …

- Advertisement -
- Advertisement -

 

చర్మ సంరక్షణ కోసం:
చలి నుంచి ముఖాన్ని రక్షించుకోవాలంటే క్రీమ్ బేస్ మాయిశ్చరైజ ర్లు రాసుకోవాలి. ఎందుకంటే చలికి పొడిబారిన చర్మానికి రాయడం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది. ముఖానికి రాసు కునే కాస్మో టిక్స్‌లో లోటస్, అయానక, బయోటెక్, అలోవీరా, సెటాఫిన్ లాంటి మాయిశ్చరైజర్స్ మేలైన చర్మ సంరక్షణ క్రీములు.
* చలికి చర్మం పొడి బారుతుంది. దీంతో శరీరం బిగుతుగా ఉం టుంది.చలికి బాగా వణికి పోతాం. ద్విచక్రవాహనంపై వెళ్లే సమ యంలో వణుకు పుడుతుంది. ఇలాంటప్పుడు స్కార్ఫ్, జర్కిన్, తలకు హెలెంట్, కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు ధరించాలి.
* లోషన్లు, మాయిశ్చరైజర్లు రాసుకోవడం వల్ల కోమలంగా మారు తుంది. గ్లిజరిన్ కొబ్బరి నూనె లాంటివి స్నానం చేసిన వెంటనే శరీరానికి రాసుకోవాలి.
* గ్లిజరిన్ లాంటి సబ్బులు వాడాలి. సబ్బుతో శరీరాన్ని మొత్తం రుద్ద కూడదు. జెల్ సబ్బులు వాడితే మంచిది. పిహెచ్ 7కు తక్కువ ఉన్న సబ్బులు చర్మాన్ని రక్షిస్తాయి.
* వారానికోసారి,ఆలివ్ ఆయిల్,కొబ్బరి నూనెతో మసాజ్ చేసు కోవాలి, తరువాత తలస్నానం మేలు.
* గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ముందుగా వైట్ ప్యారా ఫిన్, పెట్రోలియం జెల్లీ, లిక్విడ్ ప్యారాఫిన్ లాంటి మాయిశ్చ రైజర్స్ రాసుకుని స్నానం చేయడం మేలు.
* చలికి కళ్ల చుట్టూ దురదవచ్చే ప్రమాదం ఉంది.దీన్నుంచి రక్షిం చుకోవడానికి విటమిన్ ‘ఇ’ క్రీమ్ రాయాలి.
* చలికి పెదాలు పగిలి రక్తం కారే ప్రమాదముంది. వ్యాజిలిన్ లిప్‌బామ్ లాంటివి రాయాలి.
* చలికాలంలో ఎగ్జిమా లాంటి చర్మవ్యాధులు వచ్చే ప్రమాద ముంది. నీరు కారి పొక్కులు వస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
* రాత్రి వేళల్లో విధులు ముగించుకుని వెళ్లేవారు ఉన్ని దుస్తులు ధరించాలి.
* చిన్న పిల్లలను, వృద్దులను చలిలో తిప్పడం మంచిది కాదు. వీరు వెచ్చని దుస్తులు ధరించాలి.
* కొందరు చలికాలం కదా.. అని బకెట్ల కొద్దీ వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల శరీరంపై ఉండే కణాలు చనిపోతాయి. చర్మం ముడుతలు బారుతుంది. ఫలితంగా వయసు మీద పడినట్లు కనిపిస్తుంది. అందుకే పది నిముషాలకంటే ఎక్కువ సేపు స్నానం చేయెద్దు, రోజూ పడుకునేటప్పుడు మాయిశ్చ రాయిజింగ్ రాసుకొవడం మరువొద్దు.

చిన్నారుల కోసం:

చిన్నారులను చలికాలంలో వయస్సును బట్టి కొంచెం సేపు సూర్యరశ్మి తాకేలా ఉంచాలి. గ్లోవ్స్ తప్పక తొడగాలి. చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు వాడాలి అని పిల్లల వైద్యనిపుణులు చెబుతున్నారు.
* శీతాకాలంలో పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా కనిపి స్తుంటాయి.
* కేరింత దగ్గు, అస్తమా.. ఉంటే చల్లటి నీటితో స్నానం చేయిం చకూడదు.
* మంచులో ఉండే కాలుష్యంతో స్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. చర్మం పొడిబారినట్లు ఉంటుంది. వైద్యుడి సలహా మేరకు చర్మలేపనాలు తీసుకోవాలి.
* పెట్రోలియం జల్స్, లిక్విడ్స్ పెరాఫిన్ జల్స్ వంటివి స్నానం చేసిన 3 నుంచి 5 నిముషాల తరువాత ఒంటి పైన రాయడం వల్ల చర్మం పగలడం, దురదల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
* పిల్లలకు శీతాకాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలి.
వృద్దుల ఆరోగ్యం కోసం:
* పెద్ద వయసు వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో శ్వాస కోశ వ్యాధులు, గుండె జబ్బులు అధికంగా వచ్చే అవకాశముంది. పొగతాగడం, మత్తు పానీయాలు తీసుకోవడం మంచిదికాదు.
* ఆరోగ్యానికి అనుగుణంగా సూర్యుడు వెలుగులోకి వచ్చాకే వ్యాయాయం చేయాలి.
* చర్మానికి లోషన్స్ రాసుకోవాలి, లేదంటే చర్మం పూర్తిగా బిగుసుకుపోతుంది.
* వ్యాయామానికి ఒక్కరేవెళ్లకుండా మరొకర్ని వెంట తీసుకెళ్లాలి.
గర్భిణుల కోసం:
* గర్భిణులకు శీతల గాలుల వల్ల గుర్రపు వాతం, చర్మంపై దురదలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది.
* పొగ తాగడం, మత్తుపానీయాలు తీసుకోరాదు.
* తినుబండారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
* పొద్దున వామ్‌అప్ చేయకూడదు.
* చలికాలం తీవ్రంగా ఉన్నప్పుడు కడుపులో బేబి కదలికలను మరోసారి పరీక్షించుకోవాలి.
* ఉదయం పూట చలి, మంచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బయటకు రాకపోవడమే మంచిది.
ఆస్తమా రోగుల కోసం:
ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
* ఆస్తమా ఇబ్బంది ఉన్నవారు చలిగాలి వీచే సమయంలో ఆరుబయట తిరగరాదు. వ్యాధిని అదుపులో ఉంచే ఔషధాలను క్రమం తప్పకుండా వాడాలి.
* చల్లని పానీయాలు, ఐస్‌క్రీం, చాక్లెట్లు తదతర వాటికి దూరంగా ఉండాలి.
* శరీరమంతా ఉలెన్ దుస్తులు కప్పుకోవాలి. ముఖ్యంగా మంకీ క్యాప్ స్కార్ఫ్ ధరించాలి.
* వేడి పదార్థాలే భుజించాలి.
* ఫ్యాన్ వాడకం తగ్గించాలి.
* చలి బాగా ఉంటే రూమ్ హీటర్ వాడాలి.
* పడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
* దోమల కాయిల్స్ వాడటం మానేయాలి.
* నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలి.
* గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
పాదాలు పగిలితే:
చలికాలంలో అతిగా చలి ఉండటం వల్ల పాదాలు త్వరగా పలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వంటశాలలో అధికం గా తడి నీళ్ళ ప్రాంతంలో ఉండటం మంచిది కాదు.
* పాదాలు పగిలితే రోజూ పడుకునే ముందు ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటిలో గానీ, సాధారణ గోరు వెచ్చటి నీటిలో గాని పాదాలను 5 నుంచి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత పోడి బట్టతో తుడిచి మాయిశ్చరైజర్లు రాయాలి. విటమిన్ ఇ క్రీమ్స్ రాయడం మంచిది.
* కొందరు పగిలిన పాదాలను పదేపదే నీళ్లలో కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల పగుళ్లలో ఫంగస్ వచ్చే ప్రమాదముంది. ప గుళ్లకు పసుపు, నిమ్మరసం వంటివి పూయొద్దు. మధుమేహ రోగులుకాలివేళ్ల మధ్య పగుళ్లువస్తే తగినజాగ్రత్తలు పాటించాలి.
* ఎప్పటికప్పుడు గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసిన తరువాత జెల్లీ రాయాలి.
స్వెటర్లకు పెరిగిన డిమాండ్:
రోజు రోజు చలి పెరుగుతుండటంతో ఉన్ని దుస్తులకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న పిల్లలు, మహిళలు, వృద్దులు, యువతీ యువకులు స్వెటర్లను ధరించటా నికి ఆసక్తి కనబర్చడంతో స్వెటర్ల కు కొనుగోల్లు ఊపందుకున్నాయి. జిల్లా కేంద్రంలో ఖలిల్‌వాడి, పెద్ద బజార్, వినాయక్ నగర్, కంఠేశ్వర్.. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, పట్టణాలలో నేపాల్ నుంచి వచ్చిన స్వెటర్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News