Sunday, April 28, 2024

‘లైగర్’ పక్కా తెలుగు సినిమా

- Advertisement -
- Advertisement -

Vijay Devarakonda speech at 'LIGER' Press Meet

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) ఈనెల 25న విడుదలకానుంది. ది గ్రేట్ మైక్ టైసన్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘లైగర్’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “హైదరాబాద్ నుండి వెళ్లి ఇండియా మొత్తానికి ఒక కథ చెప్పాలని కలగన్నాం. అది ‘లైగర్’తో నెరవేరింది. ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన పెద్ద ఎత్తున ప్రేమ లభించింది. కానీ ఎప్పుడూ మర్చిపోలేని ప్రేమ ఇక్కడి నుండే మొదలైంది. ‘లైగర్’పై మేము చాలా నమ్మకంగా వున్నాం. ఈ సినిమాతో ఇండియా షేక్ అవుతుంది. ఈనెల 25న అందరికీ నచ్చే సినిమా, పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాం.

‘లైగర్’ పక్కా తెలుగు సినిమా. అయితే సినిమాను మాత్రం తెలుగు, హిందీలో రెండిట్లో షూట్ చేశాం. సినిమా చూసినప్పుడు పూర్తిగా తెలుగు సినిమా అని ఫీలవుతారు. ‘లైగర్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమా. అలాగే ఫిజికల్‌గా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా కూడా ఇదే. బాడీని ట్రాన్ ఫార్మ్ చేయడానికి ఏడాదిన్నర కాలం పట్టింది. మైక్ టైసన్‌తో పని చేయడం జీవితాంతం గుర్తుపెట్టుకునే జ్ఞాపకం. సినిమా యాక్షన్ కోర్రియోగ్రఫీ గురించి తనకి తెలియదు. షూటింగ్ రోజు ఆయన్ని చూస్తే భయం వేసింది. ఆయనది మామూలు పర్సనాలిటీ కాదు. షేక్ హ్యాండ్ ఇస్తే పది కేజీల బరువు తాకినట్లు వుంటుంది. ఆయన మెడ మనకి మూడింతలు వుంటుంది. ఆయన షూ సైజ్ 16. ఎక్కడా దొరకలేదు, స్పెషల్‌గా తయారు చేశాం. క్లైమాక్స్‌లో పెద్ద ఫైట్ సీక్వెన్స్ వుంది. ఆయన రియల్ గా నటుడు కూడా కాదు. మొదట్లో చాలా భయం వేసింది. అయితే ఆయన చాలా స్వీట్ పర్సన్. ఆయన పాత్ర ‘లైగర్’లో చాలా కీలకం”అని అన్నారు. అనన్య పాండే మాట్లాడుతూ.. “దేశ వ్యాప్తంగా మాకు గొప్ప ప్రేమ లభించింది. హైదరాబాద్‌లో తెలుగు ప్రేక్షకులు పంచిన ప్రేమ మర్చిపోలేనిది. ‘లైగర్’ లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాతో సౌత్ లోకి రావడం ఆనందంగా వుంది”అని తెలిపారు.

Vijay Devarakonda speech at ‘LIGER’ Press Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News