Saturday, September 21, 2024

ఓటుకు నోటు కేసు: స్పెషల్ ప్రాసిక్యూటర్ తో విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం,  విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తున్నట్లు తెలిపింది.

తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నందున ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ కేసులో ఎలాంటి విచారణ జరగడం లేదని, నిందితుడు సిఎంగా, హోం మంత్రిగా ఉన్నారని, ఎన్నికల సమయంలో సిఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పోలీసుల సంగతి తేలుస్తామని అన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా కేసు విచారణకు స్వతంత్ర ప్రాసిక్యూటర్ ని నియమిస్తామని, అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తాం అని ధర్మాసనం వ్యాఖ్యనించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News