Thursday, September 19, 2024

కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నివాసానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. కవిత తన భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయంగా ఆహ్వానించారు. సిబ్బంది కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూడగానే తండ్రి కెసిఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కెసిఆర్ కండ్లల్లో ఆత్మీయ ఆనందం కనపడింది. తండ్రి పాదాలకు తనయురాలు నమస్కరించారు. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎంఎల్‌సి కవితను ఇడి ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మార్చి 26న కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఇడి, సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్ ఉత్తర్వు కాపీలను న్యాయవాదులు తిహార్ జైలు అధికారులకు అందించారు. 164 రోజుల తర్వాత మంగళవారం జైలు నుంచి విడుదల అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News