Sunday, September 15, 2024

పావెల్ దురోవ్ అరెస్టుకు అతడి గర్ల్ ఫ్రెండే కారణమా?

- Advertisement -
- Advertisement -

రష్యాలో జన్మించిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అజర్‌బైజాన్ నుండి శనివారం ప్రైవేట్ జెట్‌లో పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలోని దిగిన కొద్దిసేపటికే అరెస్టు చేయబడ్డారు. అతని గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న యూలియా వావిలోవాను కూడా అతనితోపాటు అరెస్టు చేసినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. అతను మొదటి సారి పట్టుబడటానికి అదే మహిళ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నారు.

టెలిగ్రామ్ తన ప్రకటనలో అరెస్టుకు సంబంధించిన వివరాలను ఇవ్వలేదు, అయితే కంపెనీ యూరోపియన్ యూనియన్ చట్టాలకు కట్టుబడి ఉందని , దాని నియంత్రణ “పరిశ్రమ ప్రమాణాలలో ,నిరంతరం మెరుగుపడుతోంది” అని పేర్కొంది.

టెలిగ్రామ్‌లో మోడరేటర్ల కొరత కారణంగా అనేక రకాల నేరాలను అనుమతించారనే ఆరోపణలపై ప్రాథమిక పోలీసు దర్యాప్తులో భాగంగా పావెల్ దురోవ్‌ను అరెస్టు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News