Friday, May 3, 2024

సరిహద్దు వివాద పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

- Advertisement -
- Advertisement -

We are committed to resolving border dispute: Himanta Biswas

యుపియా : అరుణాచల్ ప్రదేశ్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారానికి ఏది అవసరమో అది చేయడానికి అస్సోం ప్రభుత్వం కట్టుబడి ఉందని అస్సో సిఎం హిమంత బిశ్వాస్ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ 36 వ రాష్ట్రఅవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చర్చల ద్వారా సరిహద్దుల వివాదాలను పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ సూచిస్తున్నారని, అందువల్ల ఈ దేశ ప్రగతి కోసం ఈ రీజియన్ సమైక్యంగా పనిచేస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఏప్రిల్ నుంచి సరైనచర్చల ద్వారా ఈ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News