Friday, July 19, 2024

వచ్చే వారం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్ బాబు

మనతెలంగాణ/హైదరాబాద్:  వచ్చే వారం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్ బాబు చెప్పారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు అదనంగా మరికొన్ని హామీలను మేనిఫెస్టోలో ఉండబోతున్నాయని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్‌ను విమర్శించే నైతిక అర్హత బిఆర్‌ఎస్‌కు లేదన్నారు. కాగా, ప్రజలకు మేలు చేసేలా, అమలు చేయగలిగే పథకాలు, హామీలనే మేనిఫెస్టోలో పెడుతున్నామని కాంగ్రెస్ చెబుతూ వస్తోందని, ఈ క్రమంలోనే మేనిఫెస్టో రూపకల్పనకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. ఆయా జిల్లాల నేతలు, సంఘాల నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో మేనిఫెస్టో తయారు చేసి విడుదలకు సిద్ధం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News