Friday, March 1, 2024

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం… లోపాలను సమీక్షించుకుంటాం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె. కేశవరావు అన్నారు. ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సోమవారం కెకె స్పందించారు.

ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. తమ లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటామని చెప్పారు. కొత్తగా కొలువు తీరబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కెకె అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం పని చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News