Monday, April 29, 2024

లారెన్స్ బిష్ణోయిని అంతం చేస్తాం: ఏక్‌నాథ్ షిండే

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం మధ్యాహ్నం ముంబయి బాంద్రాలో నటుడు సల్మాన్ ఖాన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్టా నటుని ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పేందుకు సల్మాన్ ఖాన్ బయటకు వచ్చి ఆయనను తన ఇంటిలోకి తీసుకువెళ్లారు. అక్కడ షిండే సల్మాన్ తండ్రి, ప్రముఖ స్క్రీన్‌ప్లే రచయిత సలీమ్ ఖాన్‌ను, రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖిని, ఆయన కుమారుడు జీషన్‌ను కలుసుకున్నారు.

సల్మాన్ నివాసం వెలుపల విలేకరులతో షిండే మాట్లాడుతూ, ‘ప్రభుత్వం మీతో ఉందని సల్మాన్ ఖాన్‌తో చెప్పాను. నిందితులు ఇద్దరూ అరెస్టయ్యారు. వారిని ప్రశ్నిస్తారు. కేసు అంతు తేలుతుంది. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. ఎవ్వరినీ ఈ విధంగా లక్షం చేసుకోరాదు’ అని అన్నారు. ‘ఏ ముఠానూ లేదా ముఠా పోరునూ అనుమతించేది లేదు. ఇలా జరగడాన్ని అనుమతించం. (లారెన్స్) బిష్ణోయిని అంతం చేస్తాం’ అని షిండే చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News