Wednesday, May 22, 2024

కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఓ లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ స్థానాల సంబంధించి ఎన్నికలకు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ లేఖతో అప్రమత్తమయ్యారు. ఇక ఈ లేఖలో మావోయిస్టులు ఏం రాశారన్న విషయానికి వస్తే.. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట లేఖ విడుదల జరిగింది. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని లేఖలో మావోలు పేర్కొన్నారు.

ఈ నెల 20 న జరిగే 43 ఏళ్ళ ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరొత్సాహంతో ఘనంగా జరుపుకోవాలని, ఆదివాసుల హక్కులను అమలు చేసి, అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలను దెబ్బతీస్తూ ఆదివాసీ గ్రామాలలో హిందుత్వ శక్తులు నిర్మిస్తున్న రామమందిరాలను వెంటనే నిలిపివేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ లేఖలో ఆదివాసీ సంస్కృతి కాపాడాలనీ డిమాండ్ చేశారు.

అడవిని ద్వంసం చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను, ఇతర గనులను పెద్ద ప్రాజెక్టులను రద్దు చేయాలని, 29 శాఖల్లో ఉన్న జీవోలను చట్టం చేసి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగాలను ఆదివాసీలను నియమించాలంటూ అదివాసీ గ్రామాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కారించాలని మావోలు డిమాండ్ చేసారు. ఇక అలాగే జిల్లా, మండల కేంద్రాల్లో ఆదివాసీలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని లెఖలో మావోలు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News