Sunday, April 28, 2024

సిరులొలికించే వరి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాం ,సాగునీటి వనరులు అందుబాటులో ఉండడం, వాతావరణం అనూకూలించటం తో ఈసారి ఖరీఫ్‌లో వరినాట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 65,00,873 ఎకరాల్లో వరిసాగు జరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో సీజన్ ముగిసే సరికి 64.46లక్షల ఎకరాల్లో వరిపంట సాగులోకి వచ్చింది.ఈ సారి అంతకు మించిన ఉత్సాహంతో రైతులు వరిసాగులో రికార్డు నెలకొల్పారు. 49.86లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో వరిసాగును ప్రభుత్వం అంచనా వేయగా, సీజన్‌ముగిసే సరికి వరిసాగు విస్తీర్ణం 130.37శాతానికి చేరుకుంది.

రాష్ట్ర వ్యవసాయశాఖ ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణపు నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి 1,24,28,723 ఎకరాల్లో సాగుచేయించాలని ప్రాథమిక లక్ష్యాలు రూపొందించుకోగా, అదను ము గిసే సరికి మొత్తం 1,26,20,276 ఎకరాల్లో పంటల సాగులోకి వచ్చాయి. సాధారణ సాగు విస్తీర్ణ అంచనాలు మించి మొత్తం 101.54శాతం విస్తీర్ణంలో పంటలసాగు జరిగింది. అందులో ప్ర ధాన ఆహార పంటలకు సంబంధించి వరి 65లక్షల 873 ఎకరా లు, జొన్న 31.107 ఎకరాలు, సజ్జ 400, మొక్కజొన్న 527474 ఎకరాలు, రాగి 338 ఎకరాలు, ఇతర చిరుధాన్యాలు 203 ఎకరాలు సాగులోకి వచ్చాయి. పప్పుధాన్య పంటల్లో కంది 47,4299 ఎకరాలు, పెసలు 56232, మినుము 20445, ఉలవ 248, అలసందలు 332 ఎకరాలు సాగులోకి వచ్చాయి. పప్పుధాన్య పంట లు మొత్తం 551556 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేశారు.

సాధారణ విస్తీర్ణంలో మొత్తం 58.46శాతం విస్తీర్ణంలో మాత్రమే పప్పుధాన్య పంటల సాగు జరిగింది. నూనెగింజ పంటల్లో వేరుశనగ 17248 ఎకరాలు, పొద్దుతిరుగుడు 44 , సోయాబీన్ 467160 ఎకరాలు, ఆముదం 3904 ఎకరాలు, నువ్వులు 290 ఎకరాల్లో సాగు చేశా రు. ఖరీఫ్‌లో మొత్తం 519531 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో నూ నెగింజ పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా ,అందు లో 94.09శాతం విస్తీర్ణంలోనే ఈ పంటలు సాగులోకి వచ్చాయి. ప్రధాన వాణిజ్య సాగులో పత్తి ఈసారి 88.51శాతానికి మాత్రమే పరిమితమైంది. ఈ సీజన్‌లో మొత్తం 50.59లక్షల ఎకరాల్లో పత్తిసాగును అంచనా వేయగా , 4477937 ఎకరాల్లోనే పత్తిసాగు జరిగింది. పొగాకు 2316 ఎకరాలు, చెరకు 36244 ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్‌లో అహార పంటలు పప్పుధాన్యపంటలు, పంటలు , వాణిజ్య పంటలు మొత్తం 1,32,84,882 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ సారి సుమారు ఆరు లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కింద ఈసారి సాధారణ పంటల సాగు విస్తీర్ణంతో లిస్తే 18జిల్లాల్లో వందశాతం పైనే  విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, మహబూబాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. అత్యధికంగా మెదక్‌జిల్లాలో 122.48 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. అత్యల్పంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 80.25శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అత్యల్పంగా పంటలు సాగలోచి వచ్చిన జిల్లాల్లో ములుగులో 84.747శాతం, మేడ్చెల్‌లో 83.55%, రంగారెడ్డిలో 82.75%, నాగర్‌కర్నూల్‌లో 82.33శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News