Saturday, April 27, 2024

బాలుడి హత్యకేసులో నిందితుడికి మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి : మూడేళ్ల క్రితం సంచలనం రేపిన బాలుడి హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది మహబూబాబాద్ జిల్లా కోర్టు. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుపై బాలుడి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన దీక్షిత్‌రెడ్డి (9) మూడేళ్ల క్రితం అంటే 2020 అక్టోబర్ 18న అపహరణకు గురయ్యాడు. సాగర్ అనే యువకుడు బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. డబ్బు కోసమే బాలుడిని హత్య చేసినట్లు దర్యాప్తులో నిందితుడు అంగీకరించాడు. పక్కా ఆధారాలను కోర్టుకు అందజేయగా నిందితుడికి మరణశిక్షను జిల్లా న్యాయస్థానం విధించింది.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన రం జిత్‌రెడ్డి కుమారుడు దీక్షిత్. తొమ్మిదేళ్ల దీక్షిత్.. ఆడుకుంటున్న సమయం లో పథకం ప్రకారం సాగర్ ఎత్తుకెళ్లాడు. అక్కడి నుంచి శివారులో ఉన్న ధానమయ్య గుట్టపైకు తీసుకెళ్లి బాలుడిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కిడ్నాప్ చేసిన రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.45 లక్షలు ఇస్తే బాలుడ్ని వదిలేస్తానని వెల్లడించాడు. పోలీసులకు దొరకకుండా నెట్ కాల్స్ ద్వారా ఈ సమాచారం ఇచ్చాడు. అయితే తెర వెనక ఉండి డబ్బులు డిమాండ్ చేస్తూనే మరోవైపు స్థానికులతో కలిసి బాలుడి కోసం వెతుకుతున్నట్లు నటించాడు. అయితే అతని కదలికలపై అనుమానం వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరాన్ని సాగర్ అంగీకరించాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దొరికిపోతానన్న భయంతోనే దీక్షిత్‌ను చంపినట్లు అంగీకరించాడు. 2020 నుంచి సాగర్ జైలులో ఉన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News