Sunday, July 14, 2024

నేటి నుంచి వెబ్ ఆప్షన్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 70,307 సీట్లు ఉండగా ఇందులో 21,599 సీట్లు సిఎస్‌ఇలోనే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటిలో మాంద్యం భయాలున్నా..సిఎస్‌ఇ సీట్లు మాత్రం మొత్తం ఇంజనీరింగ్ సీట్లలో సింహభాగం ఉండడం విశేషం.విద్యార్థులు ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు అయోమయానికి గురి కాకుండా నిపుణుల సలహాలతోనే ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి.

కన్వీనర్ కోటాలో 70,307 ఇంజనీరింగ్ సీట్లు

అత్యధిక సీట్లు సిఎస్‌ఇలోనే
కొనసాగుతున్న ఇంజనీరింగ్
కౌన్సెలింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 70,307 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. 16 యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలలో 7,153 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని తెలిపింది. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,260 సీట్లు ఉ న్నాయని వెల్లడించింది. ఈ విద్యాసంవత్సరం జెఎన్‌టియుహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలలో మొత్తం 98,296 సీట్లు అందుబాటులో ఉండగా,70 శాతం కన్వీనర్ కోటా కింద 70, 307ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని స్పష్టం చేసిం ది. అత్యధికంగా సిఎస్‌ఈలో 21,599.. ఇసిఇ లో 10,398 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యాశా ఖ వెల్లడించింది. అలాగే సిఎస్‌ఇ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్)లో 11, 196 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డా టా సైన్స్‌లో 1365 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 606 సీట్లు, సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ)లో 126 సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ) లో 1,344 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.ఇంజనీరింగ్ సీట్లలో ఈ విద్యాసంవత్సరం సంప్రదాయ బ్రాంచీలైన సివిల్ ఇంజనీరింగ్‌లో 3231 సీట్లు అందుబాటులో ఉండగా, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2979 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3705, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 4202 సీట్లుఅందుబాటులోఉన్నట్లు సాంకే

 

తిక విద్యాశాఖ వెల్లడించింది.రాష్ట్రంలో 19 యూనివర్సిటీ కాలేజీల్లో 5,343 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, అందులో అత్యధికంగా జెఎన్‌టియుహెచ్‌లోని తొమ్మిది కాలేజీ ల్లో 3,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలోని మూడు కాలేజీల్లో 1,080 సీట్లు అందుబాటులో ఉండ గా, ఉస్మానియా యూనివర్సిటీలోని రెండు కాలేజీల్లో 630 సీట్లు, మహాత్మాగాంధీ వర్సిటీలోని ఒక కాలేజీలో 240, జెఎన్‌ఎఎఫ్‌ఎయులోని ఒక కాలేజీలో 60 అందుబాటులో ఉన్నట్లు సాంకేతి క విద్యాశాఖ తెలిపింది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రెండు కాలేజీల్లో 60 సీట్లు, పి.వి. నరసింహారావు ఉద్యానవన వర్సిటీలోని ఒక కా లేజీలో 23 సీట్లు ఉన్నాయి. అలాగే రెండు ప్రైవే ట్ యూనివర్సిటీల్లో 1,206 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది.

నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు

రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుండగా, సోమవారం(జూన్ 8) నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆదివారం వరకు 91,530 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోగా, 25,041 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైపట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జాగ్రత్తగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి

ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచించారు. కళాశాలల పేర్లు, కోడ్‌లు ఒకే రకంగా ఉన్నప్పుడు నమోదులో అయోమయానికి గురైతే కోరుకున్న కళాశాలకు బదులు మరో కళాశాలలో సీటు లభించే ప్రమాదం ఉంది. బి.టెక్ సిఎస్‌ఇ బదులు పొరపాటుగా సిఎస్‌సి అని ఆప్షన్ ఇస్తే సైబర్ సెక్యూరిటీలో సీటు రావొచ్చు. ఉత్తమ ర్యాంకు వచ్చినా పొరపాట్ల కారణంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదులో ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగే కీలకమని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే కళాశాలలు, వాటి ఎప్‌సెట్ కోడ్‌లు, ఆసక్తి ఉన్న కోర్సులు, వాటి కోడ్‌లను వెబ్‌సైట్‌లో ఉన్న మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫాంపై రాసుకొని ఆప్షన్లు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News