Sunday, September 15, 2024

వెడ్డింగ్ డైరీస్(రీ సెట్ అండ్ రీ స్టార్ట్)

- Advertisement -
- Advertisement -

ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన అతి తక్కువ సినిమాల్లో ‘వెడ్డింగ్ డైరీస్’ కూడా ఒకటి.  క్రేజీ హీరో అర్జున్ అంబటి, హీరోయిన్ చాందినీ తమిళరసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకట్ రమణ మిద్దె దర్శకత్వం వహించారు. ఎం.వి.ఆర్ స్టూడియోస్ బ్యానర్ పై వెంకట్ రమణ మిద్దె ఈ చిత్రాన్ని నిర్మించారు. మిద్దె విజయవాణి సమర్పకురాలిగా వ్యవహరించారు. టీజర్, ట్రైలర్స్ తోనే ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న ‘వెడ్డింగ్ డైరీస్’ ఈరోజు అనగా ఆగస్టు 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఏ మేర అలరించిందో తెలుసుందాం

Wedding Diaries 4

కథ : ప్రశాంత్(అర్జున్ అంబటి) ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ గా ఎదగాలన్నది అతని డ్రీం. అయితే ఇంతలో శృతి(చాందినీ తమిళరసన్) ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ బోటిక్ లో డిజైనర్ గా పనిచేస్తుంటుంది. ప్రశాంత్ ప్రేమని అర్ధం చేసుకుని.. అతనికి ఓకే చెబుతుంది. పెద్దల్ని ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీరికి ఓ పాప, బాబు జన్మిస్తారు. అప్పటివరకు సంతోషంగా జీవించిన వీరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఫ్యామిలీ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేయలేక ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు. ఒక దశలో విడాకులు తీసుకోవడానికి కూడా రెడీ అవుతారు. ఆ తర్వాత ఏమైంది? ప్రశాంత్ – శృతి విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారా? లేక మళ్ళీ కలిసిపోయారా? అనేది మిగిలిన కథ.

Wedding Diaries 3

విశ్లేషణ : వెడ్డింగ్ డైరీస్ లో చాలా హైలెట్స్ ఉన్నాయి. కథ పరంగా కొత్తగా అనిపించకపోవచ్చు. ప్రేమించి, పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత హీరో, హీరోయిన్స్ మధ్య మనస్పర్థలు రావడం అనే పాయింట్ చాలా సినిమాల్లో చూసినదే. కానీ ట్రీట్మెంట్ వైజ్ చూసుకుంటే ‘వెడ్డింగ్ డైరీస్’ లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి ‘రీసెట్ అండ్ రీ స్టార్ట్’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ క్యాప్షన్ ను బట్టి స్క్రీన్ ప్లేని దర్శకుడు వెంకట్ రమణ మిద్దె ఎంత కొత్తగా డిజైన్ చేసుకున్నాడు అనేది అర్ధం చేసుకోవచ్చు. పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ… పెళ్ళైన కొన్నేళ్ళకే ఎందుకు తగ్గుతుంది? చాలా జంటలు విడాకుల బాట ఎందుకు పడుతున్నాయి అనే సెన్సిటివ్ టాక్ ని చాలా సెన్సిబుల్ గా చెప్పాడు దర్శకుడు. కలిసుండటం, గొడవపడటం కంటే విడిపోతే వచ్చే కష్టాలని తెలుపుతూ ఈ చిత్రాన్ని ఆవిష్కరించాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ అయితే యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మదీన్ ఎస్.కె మ్యూజిక్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ రకంగా సినిమాకి సోల్ అనుకోవచ్చు.పాటలు బాగున్నాయి. వినడానికే కాదు చూడటానికి కూడా ఆకట్టుకున్నాయి. పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ కలిస్తుంది. ఈశ్వర్ ఎళ్ళుమహంతి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చింది.

Wedding Diaries

నటీనటుల పెర్ఫార్మన్స్ : అర్జున్ అంబటి ప్రశాంత్ పాత్రలో చాలా సహజంగా నటించాడు. ‘రాజా రాణి’ లో ఆర్యని తెలుగు ప్రేక్షకులు ఎంతబాగా ఓన్ చేసుకున్నారో..ఈ సినిమా చూస్తే అర్జున్ అంబటిని కూడా అంత బాగా ఓన్ చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ చాందినీ తమిళరసన్ పాత్ర చాలా టిపికల్ గా ఉంటుంది. కానీ ఆమె నటనతో ఈ పాత్రకి ఆమె జీవం పోసింది.గ్లామర్ పరంగా కూడా మెప్పించింది చాందినీ. రవి శివ తేజ, చమ్మక్ చంద్ర స్టార్టింగ్లో నవ్వించారు. సీనియర్ నటి జయలలిత కూడా హీరోకి అత్త పాత్రలో చక్కగా నటించింది.  సత్య శ్రీ, శ్రీవాణి త్రిపురనేని వంటి మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ : డైరెక్షన్, సెకండాఫ్ లో నటీనటుల పెర్ఫార్మన్స్, సంగీతం

మైనస్ పాయింట్స్ : సడన్ క్లైమాక్స్

ఓవరాల్ గా ‘వెడ్డింగ్ డైరీస్’ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమా. యూత్ ని మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ వీకెండ్ కి హ్యాపీగా థియేటర్లో చూడదగ్గ సినిమా. మిస్ కాకుండా ట్రై చేయండి :

రేటింగ్ : 3.25/5

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News