వెస్టిండీస్ (West Indies) జట్టు త్వరలో నేపాల్‌తో టి-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టును వెండీస్ ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయి హోప్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో అకీల్ హొసేన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. షార్జా వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టి-20లు జరగనున్నాయి. సెప్టెంబర్ 27, 28, 30 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తమ జట్టును వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది.
షాయి హోప్‌తో పాటు కీలక ఆటగాళ్లు అల్జారీ జోసెఫ్, జాన్సన్ ఛార్లెస్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక అకీల్ హొసేన్ సారథ్యంలో జేసన్ హోల్డర్, ఫాబియాన్ అలెన్, కైల్ మేయర్స్ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా ఐధుగురు కొత్త ఆటగాళ్లు ఈ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేయనున్నారు. అకీమ్ ఆగస్టీ, ఆల్‌రౌండర్ నవీన్ బిడైసీ, స్పిన్నర్ జీషన్ మొతారా, పేసర్ రామోన్ సైమండ్స్, కీపర్ అమీర్ జాంగూలకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్ తర్వాత వెస్టిండీస్ (West Indies) భారత్ పర్యటనకు రానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య రెండు టెస్ట్‌లు జరుగుతాయి.
Also Read : టి20 ర్యాంకింగ్స్‌లో మనోళ్ల హవా