Monday, May 6, 2024

గాలి మార్పు కనబడుతోంది: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియా బ్లాక్ భాగస్వాములైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జెడీ నాయకుడు తేజస్వీ యాదవ్ శనివారం గాలి మార్పు కనబడుతోందన్నారు. బిజెపి సినిమా ‘400 కంటే ఎక్కువ’ మొదటి రోజునే ఫెయిలయిందన్నారు.

ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లలో ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 150 కంటే ఎక్కువ సీట్లను గెలువలేదన్నారు. బిజెపి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ దుయ్యబడుతూ ‘అవినీతి పాఠశాల’ను  ప్రధాని నడుపుతున్నారన్నారు. అవినీతి శాస్త్రంకు సంబంధించిన పాఠాలనే ప్రధాని మోడీ దేశానికి బోధిస్తున్నారన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, ఎందుకంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటున్నాయన్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే హక్కులు, అవకాశాలు ప్రజలకు అందకుండా పోతాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న దుగ్ధతో బిజెపి ఉందని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News