Saturday, May 4, 2024

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో తెలుసా ?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2024 ఫలితాలు ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను అధికారులు ఒకేసారి ప్రకటించనున్నారు. మరోవైపు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1వ తేదీన విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 9.809768 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

మార్చి 10న మూల్యాంకనం నిర్వహించి ఈ నెల 10న పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మూడుసార్లు జవాబు పత్రాలను పరిశీలించిన తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తయింది. 2023 సంవత్సరంలో మే 9న ఫలితాలు ప్రకటించగా.. ఈసారి 15 రోజుల ముందే ఫలితాలు ప్రకటించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగ్గా, దాదాపు 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. శనివారంతో మూల్యాంకనం పూర్తయింది.

వారం రోజుల పాటు ఫలితాలను డీకోడ్ చేసి.. ఈ నెల 30వ తేదీ ఉదయం లేదా వచ్చే నెల 1వ తేదీ ఉదయం ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్‌తోపాటు 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికల కోడ్ ఉన్నందున మంత్రులకు బదులుగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News