Saturday, December 14, 2024

వేధింపులు తాళలేక ఉద్యోగిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లయన్స్ కంటి ఆసుపత్రిలోని కొందరు ఉద్యోగుల వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకు న్న సంఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చో టుచేసుకుంది. పోలీసులు, స్థానికులు, కుటుం బ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కిరణ్మయి (29) రెండు నెలల క్రితం లయన్స్ కంటి ఆసుపత్రిలో జూనియర్ ఆప్తమాలజిస్ట్‌గా విధుల్లో చేరింది. ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్న సీనియ ర్ ఆప్తమాలజిస్ట్‌లు ఆమెను గత కొంతకాలంగా మానసికంగా వేధిస్తుండేవారు. ఈ వేధింపుల వల్లనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని కంటి ఆసుపత్రి ఎదుట ఉంచి ధర్నాకు దిగారు. మృతురాలు సూసైడ్ లేఖ రాసినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News