Monday, April 22, 2024

పొలంలో విద్యుత్ తీగ తగిలి మహిళా రైతు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పొలంలో విద్యుత్ తీగ తగలడంతో మహిళా కూలీ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిలా పెదవేగి మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రామసింగవరం గ్రామంలో శోంఠి శ్రీనివాస రావు, దుర్గ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు కమార్తెలు ఎనిమిదో, పదో తరగతి చదువుతున్నారు. దుర్గ(35) కూలీ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. పొలం మధ్యలో కరెంట్ తీగ పడి ఉండడం ఆమె గమనించక ముందుకు వెళ్లింది. హైటెన్షన్ విద్యుత్ తీగకు ఆమె తాకడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగా ఆమె కాలింది. వెంటనే రైతులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి భర్త శ్రీనివాస రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News