హైదరాబాద్: సమానత్వం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క తెలిపారు. మహిళ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసు ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్ 2025 నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మహిళలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేదన్నారు. మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రత కోసం పోలీసులు పని చేస్తుండడంతో ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు మహిళలు వస్తున్నారని సీతక్క కొనియాడారు. సమాజంలో ప్రతి పురుషుడు మహిళను తన ఆడబిడ్డలా చూస్తే వారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్నారు. మాదక ద్రవ్యాల నుంచి ఈ సమాజాని చైతన్యం చేయాలని కోరారు. మహిళ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మహిళలను ఎదగనిద్దాం, గౌరవిద్దాం ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగనిద్దామని ఆమె పిలుపునిచ్చారు. అందరి ప్రయత్నంతో వరంగల్ ఎయిర్‌పోర్ట్ సాధించామని, వరంగల్‌కు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని చురకలంటించారు.
సమానత్వం కోసమే మహిళా దినోత్సవం: సీతక్క
- Advertisement -
- Advertisement -
- Advertisement -