Wednesday, May 1, 2024

పిల్లలతో పనిచేయిస్తే రెండేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Working with children is two year jail

హైదరాబాద్ : పిల్లలతో పనిచేయిస్తే రెండేళ్లు జైల్లో పెడతామని, అలాగే రూ. 20వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధిస్తామని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. బాల కార్మికులు కనిపిస్తే 1098 కాల్ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశా రు. శుక్రవారం ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 12న బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినంగా పాటిస్తున్నామని తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్ క్యాంపెయిన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పిల్లలు మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెరిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.

వారిని పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యానేరమని, 2016 సంవత్సరంలో చైల్డ్ లేబర్‌యాక్ట్, చైల్డ్ అడాలసెంట్ లేబర్‌యాక్ట్‌గా సవరణ చేశామన్నారు. అందులోని సెక్షన్ 3ఏ ప్రకారం 14-నుంచి 18 సంవవత్సరాల వయస్సు వారితో పనులు చేయించకూడదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చక్కటి ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేశామని, దీని ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో ఎన్‌సిఎల్‌పిలు ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ అన్నది ఒక సామాజిక రుగ్మత అని దీనిని అందరూ రూపు మాపడానికి ముందుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Working with children is two year jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News