Tuesday, April 30, 2024

కర్నాటక హైకోర్టు జడ్జీలకు వై-కేటగిరీ భద్రత: బొమ్మై

- Advertisement -
- Advertisement -

z security to Karnataka judges
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని ఇటీవల సమర్థించిన ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్థి సహా కర్నాటక హైకోర్టు ముగ్గురు న్యాయమూర్తులకు రాష్ట్ర ప్రభుత్వం వై-కేటగిరీ భద్రతను కల్పిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం తెలిపారు. ముగ్గురు న్యాయమూర్తులపై ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఓ వీడియో వెలుగు చూసిన నేపథ్యంలో బొమ్మై ఈ ప్రకటన చేశారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది భయంకరమైన సంకేతాలలో ఒకటి. ఈ రకమైన దేశ వ్యతిరేక శక్తులు పెరుగకుండా చూసుకోవాలి. న్యాయవ్యవస్థ కారణంగానే దేశంలో శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయి’ అని ముఖ్యమంత్రి ఆదివారం తన నివాసం వెలుపల అన్నారు.
త్రిసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులు కృష్ణ దీక్షిత్, ఖాజీ ఎం జైబున్నీసా కూడా ఉన్నారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో తమిళనాడులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. క్లాస్ రూమ్‌లలో హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఆచారం కాదని పేర్కొంటూ దానిని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ఇటీవల సమర్థించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News