Friday, April 26, 2024

నా హత్యకు కుట్ర వైసిపి రెబల్ ఎంపి రఘురామ సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

YCP rebel MP Raghuram sensational allegation on my murder

మన తెలంగాణ/హైదరాబాద్: జార్ఖండ్‌కు చెందిన వారితో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలో వైసిపి రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై అన్ని వివరాలతో ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయనున్నట్లుగా రఘురామకృష్ణంరాజు తెలిపారు. గుంటూరులో టిడిపి నేత చంద్రయ్యను హత్య చేయాన్ని రఘురామకృష్ణంరాజు ప్రస్తావిస్తూ వ్యక్తులు నచ్చకపోతే వ్యక్తులను, వ్యక్తులను జగన్ తీసేస్తారన్నారు. బిజెపి ఎంపి బండి సంజయ్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ విషయంలో స్పందించినట్టుగానే ఎపి సిఐడి చీఫ్ సునీల్ కుమార్‌పై తాను ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై స్పందించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాని కోరారు. జగనన్న గోరుముద్ద పథకం రాష్ట్రంలో కొనసాగదన్నారు.

ఈ విషయమై తాను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖకు ఆమె స్పందించారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. చిరంజీవిని అల్లరి చేసేందుకే ఓ పత్రికలో రాజ్యసభకు పంపుతున్నట్లుగా కథనం రాయించారనిప వైసిపిపై రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు. చిరంజీవి చెప్పకపోతే సినీ పరిశ్రమలోని సమస్యలు సిఎం జగన్‌కు తెలియవా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రభుత్వంపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి మద్దతివ్వాలని ఆయన కోరారు. ఎపి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా మీడియాలో వ్యాఖ్యలు చేశారని ఎపి సిఐడి అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని 124ఏ, ఐపిసి 153బి సెక్షన్ కింద సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో పాటుగా ఐపిసి సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపిసి సెక్షన్ 120బి కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను సిఐడి అరెస్ట్ చేసింది.

తనపై నమోదైన కేసుల విషయమై పలు కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో 2021 మే 21న రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. సొంత పూచికత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని తెలిపింది. సిఐడి అధికారులు నమోదు చేసిన కేసులో విచారణకు సహకరించాలని కూడా బెయిల్ సందర్భంగా కోర్టు సూచించింది. అయితే ఈ కేసుల్లో విచారణకు హాజరు కావాలని కూడా ఎంపి రఘురామకృష్ణంరాజుకు సిఐడి అధికారులు సమాచారం పంపారు. అయితే విచారణకు రఘురామకృష్ణంరాజు హాజరు కాలేదని సిఐడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై విచారణకు హాజరు కావాలని కోరుతూ రఘురామకృష్ణంరాజుకు ఈ నెల 12న నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న విచారణకు రావాలని సిఐడి అధికారులు కోరారు. విచారణకు హాజరవుతానని రఘురామకృష్ణంరాజు మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News