Monday, April 29, 2024

ఓ యువతీ నడిరోడ్డుపై చేసిన విచిత్ర ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన సజ్జనార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఓ యువతీ నడిరోడ్డుపై చేసిన విచిత్ర ప్రవర్తనపై ఆర్టీసి ఎండి సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. నేటి యువత అనుసరిస్తున్న పెడధోరణులపై ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే….ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్లు పడ్డాయి. వాహనాలు ఆగిపోతున్నాయి.. అదే సమయంలో బ్యాగ్ వేసుకొని రోడ్డు మధ్యలోకి వచ్చి ఓ యువతి విచిత్రంగా ప్రవర్తించింది. బ్యాగ్‌ను పక్కకు విసిరేసి రోడ్డుపై పడుకొని డ్యాన్స్ చేసింది. యువతి విచిత్రమైన ప్రవర్తనతో వాహనదారులు ఖంగుతిన్నారు. యువతి డ్యాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఆమె స్నేహితులు వీడియో తీశారు. అయితే, ఆ యువతి యూట్యూబ్ షార్ట్ కోసం ఇలా నడిరోడ్డుపై డ్యాన్స్ చేసినట్లు తెలుసుకున్న వాహనదారులు ఆమెపై మండిపడ్డారు.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ యువతీ తీరుపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతలో ఈ పెడధోరణులు విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువతకు ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్ పిచ్చి పట్టుకోవడం బాధాకరమన్నారు. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగు రికి ఆదర్శంగా నిలవాలని ఆయన యువతకు సూచించారు. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశ నం చేసుకుంటోందని ఆయన వాపోయారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడిరోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందం అంటూ సజ్జనార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News